విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 7 నుంచి జూన్ 25 వరకు CHZ- TPTY(నం.07251) ప్రతి బుధవారం, మే 8 నుంచి జూన్ 26 వరకు ప్రతి గురువారం TPTY- CHZ(నం.07252) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరుతో పాటు పలు స్టేషన్లలో ఆగుతాయన్నారు.