నాయి బ్రాహ్మణుల ఐక్యతపై పిలుపు
MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ ఐక్యంగా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పనిచేయాలని సూచించారు. మండల కమిటీని ఎన్నుకొని కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సభ్యులు భారీగా పాల్గొన్నారు.