గజపతినగరంలో అగ్నిప్రమాదం

గజపతినగరంలో అగ్నిప్రమాదం

VZM: గజపతినగరం పంచాయతీ శివారు నారాయణ గజపతిరాజుపురంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటి సత్యారావుకు చెందిన నాలుగు క్వింటాళ్ల ధాన్యం, నాలుగు ట్రాక్టర్ల గడ్డి కాలిపోయింది. సుమారు రూ.30 వేలు ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రసాద్ సిబ్బందితో మంటలను అర్పి వేశారు.