నా ఆరోపణలపై హరీష్ వివరణ ఇవ్వాలి: కవిత
TG: తన ఆరోపణలపై మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ వివరణ ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు వివరణ ఇవ్వాలి తప్ప.. తనపై ఎదురుదాడి చేయడం తగదన్నారు. బీఆర్ఎస్‌లో పరిణామాలను సీఎం రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిందే బీఆర్ఎస్ వాళ్లు అని అసహనం వ్యక్తం చేశారు.