VIDEO: ప్రమాదకరంగా కొత్తపల్లిలో ముత్యాలమ్మ చెరువు కట్ట
NLG: కొత్తపల్లి ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపులా చెట్లతో నిండిపోయి, రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనాలు అదుపు తప్పితే చెరువులో పడిపోయే ప్రమాదం ఉందని, కట్ట వెడల్పు పెంచి, రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.