ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన సబ్ కలెక్టర్

NZB: బోధన్ పట్టణం రాకాసి పేట్‌లో గల భీముని గుట్ట అయ్యప్ప ఆలయంలో బుధవారం అయ్యప్ప మాలదారణ స్వాములకు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విట్ఠల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు పళ్లెంపాటి శివనారాయణ, సెక్రటరి చక్రవర్తి, కోశాధికారి కొయ్యాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.