VIDEO: HitTV కథనానికి స్పందన.. సమస్య పరిష్కారం

KMM: నాయుడుపేట బైపాస్ సర్కిల్ రాత్రి వేళల్లో అంధకారంలో ఉందని HitTVలో ఓ కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు రాత్రి వేళల్లో సెంట్రల్ లైటింగ్‌ను ఆన్ చేశారు. సెంట్రల్ లైటింగ్ వెలుతురు ఉండడం వల్ల రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.