పెంచలయ్య మృతి పట్ల కొవ్వొత్తుల ర్యాలీ

పెంచలయ్య మృతి పట్ల కొవ్వొత్తుల ర్యాలీ

NLR: ఇందుకూరుపేట మండలంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గంజాయి మాఫియా విచ్చలవిడితనం వల్లే పెంచలయ్య హత్యకు గురయ్యారని, పోలీసులను సైతం లెక్కచేయని విధంగా వారు వ్యవహరిస్తున్నారని సీఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి రాజా తెలిపారు. పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.