మరో క్రేజీ ప్రాజెక్టుతో రామ్ పోతినేని..?
వరుస ఫ్లాప్స్‌లో ఉన్న రామ్ పోతినేని, లోకేష్ కనగరాజ్ శిష్యుడి దర్శకత్వంలో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌ను కొత్తగా చూపించనున్నట్లు టాక్. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడట. రామ్ ఎనర్జీ, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే థియేటర్లలో పూనకాలేనని, ఈ చిత్రం రామ్‌కు గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.