వక్ఫ్ ఆస్తుల నమోదుకు గడువు పెంపు
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను 'ఉమీద్' పోర్టల్‌లో నమోదు చేసేందుకు విధించిన గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ ఆస్తుల నమోదుకు ఇవాళ్టితో గడువు ముగిసినప్పటికీ, మరో 3 నెలలపాటు ఎలాంటి జరిమానా విధించబోమని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈలోగా నమోదు చేసుకోలేని వారు తమ రాష్ట్రాల్లోని వక్ఫ్ ట్రైబ్యునళ్లను సంప్రదించాలన్నారు.