VIDEO: ఉంగుటూరులో నీట మునిగిన వరి పొలాలు

కృష్ణా: ఉంగుటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో పంటలు నీటి మనిగాయి. ఇందుపల్లి, కండ్రిక, నందమూరు, పరిసరా గ్రామాల్లో ఉన్న పొలాలు వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల పొలాల్లో వేసిన నారు పూర్తిగా నీటిమనగాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు మండలంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.