సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
BDK: మణుగూరు మండల ఆశా వర్కర్లు శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసిన వర్కర్లు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.