చలికాలంలో జాగ్రత్తలు పాటించండి: SP
BHPL: చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే సోమవారం ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని, దృశ్యమానత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సూర్యోదయం తర్వాత సరైన వెలుతురు వచ్చాకే ప్రయాణం చేపట్టాలని, జాగ్రత్తలు లేకుండా వాహనాలు ఆపరాదని స్పష్టం చేశారు.