సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

SRD: సంగారెడ్డి పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలారెడ్డి శనివారం పంపిణీ చేశారు. మొత్తం 26 మందికి 15 లక్షల రూపాయల చెక్కులను అందించారు. కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.