పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి: ఎమ్మెల్యే కోళ్ల

పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి: ఎమ్మెల్యే కోళ్ల

VZM: వేపాడ మండలం బొద్దాం గ్రామంలోని యాతపేట గుడిసెలలో నివాసం ఉంటున్న కుటుంబాలను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం స్వయంగా పరిశీలించారు. తుఫాన్ సాయంత్రం తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలని కోరారు.