డంపింగ్ యార్డు పనులు వేగవంతం చేయాలి: జేసీ
ASR: రంపచోడవరంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డు పనులను త్వరగా పూర్తి చేయాలని జేసీ స్మరణ్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమీక్షించిన ఆయన, యార్డుల ఏర్పాటుకు స్థల సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు.