VIDEO: ట్రాక్టర్ ఎక్కిన మంత్రి స్వామి

ప్రకాశం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ట్రాక్టర్ ఎక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఆదివారం జరుగుమల్లి మండలంలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞత ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మారీ టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యతో పాటు మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ట్రాక్టర్ ఎక్కగా దామచర్ల సత్య ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.