గన్నవరం ఆర్టీసీ డిపో ఎదుట రీలే నిరాహార దీక్షలు

కృష్ణ: గన్నవరం డిపోలో NMUA ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిపో సెక్రటరీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, సెలవులు, వైద్య సదుపాయాల కోసం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు దీక్ష కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.