కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం: మంత్రి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం.. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రభుత్వం అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందన్నారు.