పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
సిరిసిల్ల: బోయినపల్లి మండలం, కొదురుపాక, నీలోజుపల్లి, విలాసాగర్ లోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేష్ బి గితే పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందికి భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీస్ సిబ్బంది పటిష్ట భద్రత కల్పించామని పేర్కొన్నారు.