నంది హనుమంతుని వాహనంపై ఊరేగిన అమ్మవారు
SRCL: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అమ్మవారు నంది హనుమంతుని వాహనంపై విహరించారు. ఉత్సవాలలో భాగంగా 9వ రోజు దుర్గాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అంతరాలయంలో అమ్మవారు హంస వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.