VIDEO: టెంపో-బైక్ ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు..!
CTR: పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి కమతంపల్లి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఎదురుగా వస్తున్న టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటరెడ్డి (45), విశ్వనాథ్ (55)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.