'అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత'
E.G: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. కొవ్వూరులోని TDP కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.