నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన నామినేషన్ పత్రాలను సక్రమంగా పరిశీలించి తీసుకోవాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వచ్చిన నామినేషన్లను తీసుకోవద్దన్నారు.