జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ

జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ

BHPL: జిల్లాకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొంథా తుఫాను ప్రభావంతో శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.