పల్లాలమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశల, లక్ష గులాబీ పూలు, హోమం, పూజా కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, గ్రామ సర్పంచ్ తాతకాపు పాల్గొన్నారు.