విజేతలకు ప్రతిభా పురస్కారాలు అందజేత

కోనసీమ: అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో పే బ్యాక్ టు సొసైటీ వారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జీవితాలుపై నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు మంగళవారం ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ.. మహనీయుల జీవితాలను ఆధారంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు వారు సూచించారు.