వైభవంగా మానసా దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

వైభవంగా మానసా దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

KDP: సిద్దవటం మండలంలోని కడప -చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లిలో వెలసిన శ్రీ మానసాదేవి ఆలయంలో ఆదివారం మానసాదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సిరిగళ్ళ లక్ష్మయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.