పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ
పెద్దపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన రామ్ రెడ్డి సోమవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని, పోలీసులపై నమ్మకం పెంపొందే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.