'ఓట్ల జాబితా పారదర్శకంగా ఉండాలి'
E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం రాజకీయ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, కచ్చితంగా ఉండేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు.