'హాస్పిటల్, పాఠశాలల పనులు పూర్తి చేయండి'
JGL: కోరుట్ల నియోజకవర్గంలో మిగిలిపోయిన హాస్పిటల్, పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు సహకరించాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.