కాళేశ్వరంలో ఘనంగా సీతారాముల విగ్రహాల ఊరేగింపు

కాళేశ్వరంలో ఘనంగా సీతారాముల విగ్రహాల ఊరేగింపు

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ సీతారాముల ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణ జనన ఘట్టం సందర్భంగా ఊరేగింపు సేవ నిర్వహించారు. ఈవో మహేశ్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకి పై ఊరేగింపు చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది .కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు.