పెంపుడు పిల్లి దొంగతనం.. చివరికి ఏమైందంటే.!

పెంపుడు పిల్లి దొంగతనం.. చివరికి ఏమైందంటే.!

HYD: నగరంలో వింత ఘటన చోటుచేసుకుంది. లాలాగూడ పరిధిలోని ఓ యువతికి చెందిన పెంపుడు పిల్లిని ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో ఆ యువతి నా పిల్లి నాకు కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిని పట్టుకుని విచారించగా పిల్లి బాగుందని దగ్గరికి తీసుకోగానే తన చేయి కొరికి పారిపోయిందని, ఇప్పుడు ఆ పిల్లిని ఎక్కడ నుంచి తేవాలని ఆ వ్యక్తి చెప్పాడు. చివరికి ఇద్దరికి నచ్చజెప్పి పంపించేశారు.