భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

SKLM: పలాస మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో అంతస్తులో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుడు కృష్ణారావు (48) ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తోటి కార్మికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.