చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
KMR: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాస్వ పెద్ద లక్ష్మీ(60) ఈ నెల 6న ఎడపల్లికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. బుధవారం దుర్కి చెరువులో మహిళ మృతదేహం లభించింది. దుస్తుల ఆధారంగా కుటుంబసభ్యులు లక్ష్మీగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.