క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి: ఎస్పీ

క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి: ఎస్పీ

నల్గొండలోని డాన్ బోస్కో పాఠశాలలో ఇంటర్ కాలేజ్ గేమ్స్‌కు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.