పాతమాగులురులో తప్పిన పెను ప్రమాదం

పాతమాగులురులో తప్పిన పెను ప్రమాదం

BPT: సంతమాగులూరు మండలంలోని పాతమాగులురు గ్రామ సమీపంలో మినీ పార్సిల్ బండి అదుపుతప్పి బోల్తా పడింది. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.