అట్టహాసంగా ముగిసిన మెండోరా క్రీడోత్సవాలు
NZB: గత రెండు రోజులుగా సాగుతున్న మెండోరా 69వ మండల అంతర పాఠశాలల క్రీడలు శుక్రవారం ముగిశాయి. గెలుపొందిన విద్యార్థులకు వేల్పూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఓవరాల్ ఛాంపియన్‌గా పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు నిలిచారు.