కంపోస్టు యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్ రాజు

NZB: ఆర్మూర్ పట్టణంలోని డంపింగ్ యార్డ్ వద్ద గల DRCC, కంపోస్ట్ యార్డ్‌ను నేడు మున్సిపల్ కమిషనర్ రాజు సందర్శించారు. అనంతరం పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.