నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
NLR: నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు జోగి రమేష్ అరెస్టును ఖండిస్తూ, దీనిని అక్రమ అరెస్టుగా చేపుతున్నారు.