సుంకలమ్మ, మారెమ్మ గుడి ప్రారంభం

సుంకలమ్మ, మారెమ్మ గుడి ప్రారంభం

KRNL: హోళగుంద మండలం కోగిల తోటలో ఇవాళ TDP ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పర్యటించారు. గ్రామంలో నిర్మించిన సుంకలమ్మ-మారెమ్మ అమ్మవారి గుడిని ఆమె ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలపై స్థానికులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం శివప్రసాద్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.