టీడీపీ కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. సీఎంఆర్‌ఎఫ్ కింద వైద్య సాయం, పీహెచ్‌సీ ఏర్పాటు, మసీదు నిర్మాణం, భూముల ఆన్‌లైన్ నమోదు తదితర సమస్యలపై పలువురు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. బాధితుల సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.