ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల పరిశీలన

ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల పరిశీలన

NZB: కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్, రాజరాజేశ్వరి నగర్, నాగపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన పోలింగ్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. మండల పంచాయతీ అధికారి సదాశివతో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.