జమ్మలమడుగులో 2000 మందితో రంజాన్ వేడుకలు
KDP: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగులో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు పాటించిన ఉపవాస దీక్షలు విరమించి, పట్టణంలోని ప్రధాన నమాజ్ కట్ట మైదానంలో ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి దాదాపు 2000 మందికి పైగా ముస్లింలు భారీగా చేరుకుని భక్తిశ్రద్ధలతో సామూహిక నమాజ్ నిర్వహించారు.