రాజమండ్రిలో సందడి చేసిన నటుడు సుమన్
E.G: ప్రముఖ సినీ నటుడు సుమన్ గురువారం రాజమండ్రిలో సందడి చేశారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. కాకినాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి నుంచి వెళ్తూ లాలాచెరువులో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ ప్రాంగణంలో ఉన్న మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని పరిశీలించారు.