తీగల వంతెన ఏమైంది?

NLG: పానగల్ ఉదయసముద్రం వద్ద ప్రతిపాదించిన తీగల వంతెన నిర్మాణంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. BRS హయాలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంబంధిత ప్రతిపాదనలు, నమూనా విడుదల చేశారు. 350 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. దాదాపు మూడేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఏమైందని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.