దాకారపు పేటలో కుళాయిల్లో మురికి నీరు

దాకారపు పేటలో కుళాయిల్లో మురికి నీరు

కోనసీమ: అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలోని దాకారపు పేటలో మంచినీటి కుళాయిలు ద్వారా కలుషిత నీరు వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కుళాయిల నుంచి మురికి నీరు వస్తుందని, ఇవి తాగడానికి ఉపయోగపడడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.