ప్రాణహిత నది, ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన కలెక్టర్
ASF: కౌటాల మండల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కె.హరిత తుమడిహెట్టీ వద్ద మంగళవారం ప్రాణహిత నదిని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించి, నీటి లభ్యత, వానాకాలం వరద పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో నీటి పరిస్థితిపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో MPDO ప్రసాద్, MRO ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.