జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర ఛైర్మన్‌గా రవి నియామకం

GNTR: తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన బొర్రా రవి చంద్ర, జవహర్ బాల్ మంచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛైర్మన్ (ప్రొబేషనరీ)గా శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఛైర్మన్ డాక్టర్ జివి. హరి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.