'స్టాలిన్‌ ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసింది'

'స్టాలిన్‌ ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసింది'

కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిసామి ఖండించారు. స్టాలిన్ ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసిందని మండిపడ్డారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మహిళలకు వంద శాతం భద్రత నిర్థారించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.